శనివారం 30 మే 2020
Business - Apr 15, 2020 , 15:31:48

మాకూ రుణ మినహాయింపు కావాలి

మాకూ రుణ మినహాయింపు కావాలి

కరోనా నేపథ్యంలో వ్యాపారాలు దెబ్బతిని, ఉద్యోగాలు కోల్పోయిన ప్రజలు తమ రుణవాయిదాల చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నందున వారి రుణ చెల్లింపులపై ఆర్బీఐ మూడునెలల మారటోరియం విధించింది. దాంతో తమకు కూడా రుణాలపై మారటోరియం వర్తింపజేయాలని సూక్ష్మరుణ సంస్థల సంఘం సాధన్‌ ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేసింది. సూక్ష్మరుణ సంస్థలు బ్యాంకులు, ఆర్థిక అభివృద్ధిసంస్థల నుంచి రుణాలు తీసుకొని ప్రజలకు రుణాలిస్తుంటాయి. ఇప్పుడు తమ వద్ద రుణాలు తీసుకున్న ప్రజలు రుణాలు చెల్లించవల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెప్పిందని, కానీ తాము మాత్రం బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని సాధన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీ సతీష్‌ తెలిపారు. తాము ఇచ్చిన రుణాలు వసూలు కానప్పుడు తాము మాత్రం బ్యాంకు రుణాలను ఎలా చెల్లించగలమని ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో ప్రశ్నించారు.    


logo