శనివారం 30 మే 2020
Business - Apr 13, 2020 , 16:57:45

ఆన్లైన్లో మద్యం అమ్మకాలు?

ఆన్లైన్లో మద్యం అమ్మకాలు?

కరోనాను కట్టడిచేసేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించటంతో అన్ని వ్యాపారాలతోపాటు మద్యం అమ్మకాలుకూడా నిలిచిపోయాయి. దాంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మద్యం ఉత్పత్తి, విక్రయదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆన్లైన్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని అంతర్జాతీయ స్పిరిట్, వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశాయి.

ఆన్లైన్తోపాటు ఫోన్చేస్తే ఇంటికే మద్యం చేరవేసే సేవలకు అనుమతి ఇవ్వాలని సంస్థలు వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్రప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాయి. ఆన్లైన్ అమ్మకాలవల్ల సామాజిక దూరం కూడా సాధ్యమవుతుందని తెలిపాయి. ఆన్లైన్లో అమ్మినప్పటికీ వయసు ధృవీకరణ ఉన్న ఏదైనా ఐడీకార్డును చూపితేనే మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ అమ్మకాలకు పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చాయి. సంస్థల వినతిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి  


logo