బుధవారం 03 జూన్ 2020
Business - Apr 13, 2020 , 16:14:41

ఉత్పత్తి తగ్గినా ధరల పతనం ఆగదు

ఉత్పత్తి తగ్గినా ధరల పతనం ఆగదు

ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లతో చమురు వినియోగం అసాధారణ స్థాయిలో తగ్గిపోయింది. దాంతో చమురు ధరలు మూడుదశాబ్దాల క్రితంనాటికి పడిపోయాయి. దాంతో చమురు ఉత్పత్తి దేశాలపై ఒపెక్ ప్లస్ కూటమి ఇటీవల సమావేశమై రోజూ తమ ఉత్పత్తిలో దాదాపు కోటి బ్యారెళ్లను తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అయినా వచ్చే మూడువారాల్లో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం లేదని ప్రముఖ రేటింగ్ సంస్థ గోల్డ్మన్సాచ్ తెలిపింది.

ఒపెక్ దేశాల మధ్య కుదిరిన ఉత్పత్తి తగ్గింపు నిర్ణయం ఇప్పుడున్న పరిస్థితుల్లో చమురు ధరలను పెంచలేదని, అందువల్ల మరికొన్ని వారాలపాటు ధరలు తగ్గుతూనే ఉంటాయని అభిప్రాయపడింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా కోటీ 90 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగం తగ్గే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నిర్ణయించిన ఉత్పత్తి తగ్గింపు చర్యలు ధరల పతనాన్ని ఆపలేవని స్పష్టంచేసింది.   


logo