బుధవారం 03 జూన్ 2020
Business - Apr 12, 2020 , 16:28:08

వృద్ధిరేటు రెండుశాతానికి మించదు

వృద్ధిరేటు రెండుశాతానికి మించదు

అసలే బలహీనంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ సంక్షోభం దారుణంగా దెబ్బతీసిందని ప్రపంచబ్యాంకు తెలిపింది. 1991నాటి సంస్కరణలకు ముందునాటి పరిస్థితులు ఏర్పడనున్నాయని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 1.5నుంచి 2.8శాతం మాత్రమే ఉండవచ్చని అంచనావేసింది. మార్చి 31తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 4.8 నుంచి 5 శాతం వరకు ఉంటుందని తెలిపింది. దేశీయ సప్లై, డిమాండ్లలో అవాంతరాలు ఏర్పడటంతో ఆ ప్రభావం వృద్ధిరేటుపై పడనుందని వెల్లడించింది.   


logo