శనివారం 30 మే 2020
Business - Apr 12, 2020 , 15:59:45

లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చే అవకాశం

లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చే అవకాశం

మార్చి 14 నుంచి ఎక్కడివక్కడే నిలిచిపోయిన విమానాలు త్వరలోనే ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ ప్యాసింజర్‌ విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం కార్గో విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. చాలా రాష్ట్రాలు కూడా ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించాయి. అయితే కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించినప్పటికీ విమానయానాన్ని మాత్రం దానినుంచి మినహాయించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వవర్గాలు ఆదివారం వెల్లడించాయి.

లాక్‌డౌన్‌తో విమానయాన సంస్థలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితికూడా లేదు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే కొన్ని ఎంపికచేసిన రంగాలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించాలని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే విమానయానానికి మినహాయింపు ఇవ్వవచ్చని తెలుస్తున్నది. అయితే, ముందుగా దేశీయ సర్వీసులు మాత్రమే నడిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.   


logo