శనివారం 30 మే 2020
Business - Apr 11, 2020 , 10:03:17

కరోనా అనంతర ఉద్యోగాలపై ఆశలు

కరోనా అనంతర ఉద్యోగాలపై ఆశలు

కరోనా మహమ్మారి సృష్టించిన అసాధారణ అత్యవసర పరిస్థితి కోట్లమంది ఉపాధి కోల్పోయారు. వ్యాపారాలన్నీ చిన్నాభిన్నం అయ్యాయి. ఈ అత్యవసర పరిస్థితి తర్వాత ఆర్థిక వ్యవస్థలు ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి లేదనే సర్వేలు వెలువడుతున్నాయి. అయితే, కొన్ని వ్యాపారవర్గాల్లో మాత్రం త్వరలోనే ఉద్యోగ మార్కెట్‌ పుంజుకుంటుందని, అనేక కొత్తరంగాలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తాయని నమ్మకంగా చెపుతున్నారు.

కోవిడ్‌ సంక్షోభం అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకొనే క్రమంలో గేమింగ్‌, ఓటీటీ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వర్చువల్‌ టీమ్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్ వేర్‌, ఈ కామర్స్‌, విద్యాసాంకేతిక రంగాలు స్థిరంగా అభివృద్ధి చెందనున్నాయని పలు పెద్దకంపెనీల మానవ వనరుల విభాగాలు విశ్వసిస్తున్నాయి. ఈ రంగాల్లో భారీ ఆకర్శనీయమైన ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని కెల్లీ ఓసీజీ ప్రజాసంబంధాల అధికారి ఫ్రాన్సిస్‌ పదమదన్‌ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న వర్చువల్‌ మెడికల్‌ టూరిజం ఈ సంక్షోభం అనంతరం మానసిక వైద్యం, వేగవంతమైన వైద్య విధానాలతో మరింత అభివృద్ధి చెందనున్నదని భావిస్తున్నారు. సేవలు, ఆరోగ్యరంగాలు మంచి పురోగతి సాధించనున్నాయని దాంతో ఆయారంగాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయని పదమదన్‌ పేర్కొన్నారు. డెలివరీ సర్వీస్‌లో కాంట్రాక్టు ఉద్యోగావకాశాలు పెరుగే అవకాశం ఉందని అన్నారు.    


logo