శుక్రవారం 29 మే 2020
Business - Apr 10, 2020 , 17:44:08

మా బకాయిలు వెంటనే ఇవ్వండి

మా బకాయిలు వెంటనే ఇవ్వండి

ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌లిమిటెడ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమకు బకాయి పడిన రూ.1500 కోట్లను వెంటనే చెల్లించాలని టెలికం మౌలికవసతుల కల్పన సంస్థలు శుక్రవారం డిమాండ్‌ చేశాయి. ప్రస్తుత కష్టసమయంలో నెట్‌వర్క్‌లను నిర్వహించటం కష్టంగా ఉందని టవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ (టైపా)  బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌కు లేఖ రాసింది. నెట్‌వర్క్‌లను నిర్వహించటానికి అత్యవసరమైన విద్యుత్‌, డీజిల్‌, బ్యాటరీలు తదితరాల కొనుగోలు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తంచేసింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి దీర్ఘకాలంగా రావాల్సిన పెండింగ్‌ బిల్లులు దాదాపు రూ.1500 కోట్లకు చేరుకోవటంతో నెట్‌వర్క్‌ల నిర్వహణ చాలా కష్టంగా మారింది. ఈ విషయంలో సంస్థ వెంటనే స్పందిస్తుందని ఆశిస్తున్నాం అని టైపా డైరెక్టర్‌ టీఆర్‌ దువా తన లేఖలో పేర్కొన్నారు. 


logo