బుధవారం 03 జూన్ 2020
Business - Apr 10, 2020 , 17:28:49

ఇండియాకు 2.2 బిలియన్ డాలర్లు సాయం

 ఇండియాకు 2.2 బిలియన్ డాలర్లు సాయం

కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారత ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వాలని ప్రణాళికలు వేస్తున్నది. అందుకోసం అవసరమైన నిధులను సేకరించేందుకు అన్నిమార్గాలను వెదుకుతున్నది. ఈ సమయంలో భారత్‌కు బాసటగా నిలిచేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ముందుకు వచ్చింది. భారత్‌కు 2.2 బిలియన్‌ డాలర్లు (రూ.16500 కోట్లు) అత్యవసర సాయం అందిస్తామని ఏడీబీ అధ్యక్షుడు మసాట్సుగు అసకావా శుక్రవారం ప్రకటించారు. భారత ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్‌తో ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

భారత అత్యవసరాలను తీర్చేందుకు ఏడీబీ కట్టుబడి ఉంది. తక్షణం రూ.16500 కోట్ల సాయం అందించనున్నాం. భారత్‌లో ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిధులను అందిస్తున్నాం. కరోనా ప్రభావం పేదలు, అసంఘటిత కార్మికులు, ఎంఎస్‌ఎంఈలపై పడకుండా చూడాలి. ఈ మహమ్మారిని ఎదుర్కోవటంలో భారత్‌ చేస్తున్న పోరాటం ప్రశంసనీయమైనది అని ఆయన పేర్కొన్నారు.  


logo