శనివారం 30 మే 2020
Business - Apr 10, 2020 , 17:12:26

ఎన్బీఎఫ్సీల కష్టాలు ఇన్నిన్ని కావయా

ఎన్బీఎఫ్సీల కష్టాలు ఇన్నిన్ని కావయా

కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించటంతో ప్రజలకు ఆదాయాలు లేకుండా పోయాయి. దాంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వుబ్యాంకు బ్యాంకులోన్లపై మూడు నెలల మారటోరియం విధించింది. అయితే ఈ మారటోరియం కాలంలో కిస్తీ చెల్లించకుంటే బ్యాంకులు దానిని ఎలా పరిగణిస్తాయన్నదానిపై ఇప్పటికీ సందేహాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే మారటోరియం కారణంగా తాము తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని బ్యాంకింగేతర రుణ సంస్థలు (ఎన్బీఎఫ్‌సీ)లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ఆర్బీఐ పేర్కొన్న మారటోరియం ప్రకారం వ్యక్తులు, చిన్న సంస్థలు బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులకు నెలనెలా చెల్లించాల్సిన కిస్తీలను మూడు నెలలపాటు వాయిదా వేసుకోవచ్చు. అయితే ఇందులో ఎన్బీఎఫ్సీలను చేర్చలేదు. ఈ సంస్థలు బ్యాంకులవద్ద అప్పులు తీసుకొని వ్యక్తులకు, చిన్న సంస్థలకు రుణాలు ఇస్తాయి. ఇవి ఇచ్చే రుణాలపై వడ్డీ బ్యాంకుల వడ్డీకంటే కొంచె ఎక్కువగా ఉంటుంది. మారటోరియం కారణంగా ఈ సంస్థల వద్ద లోన్లు తీసుకున్న వ్యక్తులు, చిన్న వ్యాపారస్తులు కిస్తీలు కట్టడంలేదు. కానీ ఈ సంస్థలు మాత్రం బ్యాంకులకు అప్పులను తిరిగి చెల్లించాల్సి వస్తున్నది. దాంతో ఇవి తీవ్రమైన నిధుల కొరతలో ఉన్నాయని క్రిస్టిల్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మారటోరియం విషయంలో ఆర్బీఐ ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని ఈ సంస్థలు కోరుతున్నాయి.  


logo