బుధవారం 03 జూన్ 2020
Business - Apr 10, 2020 , 17:17:32

ఆహార పదార్థాలను తప్ప మిగతా వస్తువులను కొనేవారే లేరు

ఆహార పదార్థాలను తప్ప మిగతా వస్తువులను కొనేవారే లేరు

కరోనా కారణంగా దేశం మొత్తం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించటంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని ఇప్పటికే పలు సర్వేలు తెలిపాయి. తాజాగా భారత ఆర్థిక వ్యవస్థకు కరోనా తీవ్రమైన డిమాండ్‌ షాక్‌ ఇచ్చిందని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సంస్థ తెలిపింది. 130 కోట్లమంది ఇండ్లకే పరిమితం కావటంతో మార్కెట్లో ఆహార పదార్థాలకు తప్ప ఏ వస్తువునూ కొనేవారే లేరని ఈ సంస్థ తన నివేదికలో పేర్కొంది. దాంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవాలంటే చాలాసమయం పడుతుందని వెల్లడించింది.

అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో 2019 చివర, 2020 ప్రారంభంలో కాస్త ఆశావహ పరిస్థితులు ఏర్పడ్డాయని అంతలోనే కరోనా సంక్షోభం రావటంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యిందని పేర్కొంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే అనేక మార్పులు అవసరం అవుతాయని సంస్థ ప్రధాన ఆర్థికవేత్త అరుణ్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. 2020 సంవత్సరానికి దేశ స్తూల జాతీయోత్పత్తి జీడీపీ కేవలం 0.2శాతం మాత్రమే ఉండవచ్చని, 2021 లో కాస్త పుంజుకొని 0.5శాతంగా నమోదు కావచ్చని వెల్లడించింది.


logo