బుధవారం 03 జూన్ 2020
Business - Apr 08, 2020 , 17:24:23

త్వరలో మరో ఆర్ధిక ప్యాకేజీ!

త్వరలో మరో ఆర్ధిక ప్యాకేజీ!

దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా గాడి తప్పిన ఆర్థిక రంగాన్ని మళ్లీ దారిలో పెట్టేందుకు కేంధ్ర ప్రభుత్వం మరింత పెద్ద ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకమైన సప్లై, డిమాండ్లను సమతుల్యం చేసేందుకు ఈ ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, ప్యాకేజీని ఎప్పుడు ప్రకటించాలనే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

కరోనా సంక్షోభం కారణంగా ఏర్పడిన పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఇటీవలే రూ.1,70000 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. తర్వాత ప్రకటించబోయే ప్యాకేజీ అంతకంటే భారీగా ఉండనుందని సమాచారం. ప్యాకేజీ రూపకల్పన కోసం అన్ని మంత్రిత్వశాఖలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతున్నది. ఏ రంగానికి ఎలాంటి ఉద్దీపన అవసరం అనే అంశాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 


logo