శనివారం 06 జూన్ 2020
Business - Apr 08, 2020 , 15:00:37

32శాతం తగ్గిన మారుతి ఉత్పత్తి

32శాతం తగ్గిన మారుతి ఉత్పత్తి

దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకీపై కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. మార్చి నెలలో ఈ సంస్థ ఉత్పత్తి మార్చి నెలలో ఏకంగా 32.26శాతం తగ్గింది. 2019 మార్చిలో 1,35,236 ప్యాసింజర్‌ వాహనాలను ఉత్పత్తి చేసిన ఈ సంస్థ 2020 మార్చిలో  కేవలం 91,602 వాహనాలను మాత్రమే ఉత్పత్త చేసినట్లు బుధవారం ప్రకటించింది. ఆల్టో, ఎస్‌ ప్రెస్సో, వాగనార్‌, సెలెరియో, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌ వంటి చిన్న వాహనాల ఉత్పత్తి ఎక్కువగా పడిపోయింది. 


logo