మంగళవారం 26 మే 2020
Business - Apr 07, 2020 , 18:06:17

3శాతం పెరిగిన చమురు ధరలు

3శాతం పెరిగిన చమురు ధరలు

కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నడూలేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న చమురు మార్కెట్‌ మంగళవారం కాస్త తేరుకున్నది. ప్రపంచ ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు తమ ఉత్పత్తిని తగ్గస్తామని ప్రకటించిన నేపథ్యంలో ధరలు మూడుశాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మంగళవారం బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 93సెంట్లు పెరిగి 33.98 డాలర్లకు చేరింది. సౌదీ అరేబియాతోపాటు రష్యా కూడా చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించటంతో ధరలు పెరిగాయని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. కరోనా కారణంగా ప్రపంచదేశాలన్నీ లాక్డౌన్‌లో ఉండటంతో చమురు వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. దాంతో ముడిచమురు ధరలు కూడా పడిపోయాయి.  


logo