బుధవారం 03 జూన్ 2020
Business - Apr 07, 2020 , 17:36:46

కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం

కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం

కరోనా దెబ్బకు దేశంలో గృహనిర్మాణరంగం కుదేలైంది. నోట్లరద్దు తర్వాత పడుతూ లేస్తూ వస్తున్న ఈ రంగాన్ని కరోనా సంక్షోభం కోలుకోలేని దెబ్బతీసింది. మార్చితో ముసిగిన త్రైమాసికంలో గృహాల అమ్మకాలు ఏకంగా 29శాతం పడిపోయాయి. ఇండ్లు కొనేవారు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కురాక కంపెనీలు దీవాళా అంచుకు చేరుకున్నాయి. ఇప్పటికే రూ.3.65 లక్షల కోట్ల విలువైన ఇండ్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయని, కానీ కొనేవారే లేరని జేఎల్‌ఎల్‌ సంస్థ తెలిపింది. గతేడాది మొదటి త్రైమాసికంలో 38628 నివాస గృహ విక్రయాలు జరుగగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 27451కి పడిపోయాయని తెలిపింది.   


logo