గురువారం 04 జూన్ 2020
Business - Apr 07, 2020 , 16:30:49

రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం.. ఆర్బీఐ

రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం.. ఆర్బీఐ

కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో రాష్ట్రాల ఆదాయం తీవ్రంగా పడిపోయింది. దాంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో కూడా ఆలోచించే ధోరణిలో చాలా రాష్ట్రాలు ఉన్నయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టింది. అన్ని రాష్ట్రాలకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ సౌకర్యాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ పథకాలకు అవసరమైన ఖర్చుల విషయంలో కొరత ఏర్పడకుండా చూసేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. 


logo