గురువారం 04 జూన్ 2020
Business - Apr 06, 2020 , 16:59:19

బ్యాంకు రుణాల్లో భారీ పెరుగుద‌ల ఈ రంగానిదే

బ్యాంకు రుణాల్లో భారీ పెరుగుద‌ల ఈ రంగానిదే

దేశంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకుల్లో వ్య‌క్తిగత రుణాల వాటా భారీగా పెరుగుతున్న‌ట్లు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలు రూ. 89.8 ల‌క్ష‌ల కోట్లు. గ‌తేడాదితో పోల్చితే ఇది కేవ‌లం 7.3శాతం ఎక్కువ‌. ఇందులో మాన్యుఫాక్చ‌రింగ్ రంగం వాటా 31శాతం. అంటే రూ. 27.9 ల‌క్ష‌ల కోట్లు. ఈ రంగం రుణ విత‌ర‌ణ‌లో గ‌తేడాదితో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 

ఇక వ్య‌క్తిగ‌త రుణాల వాటా రూ.25.3 ల‌క్ష‌ల కోట్లు. అంటే 28శాతం. ఈ రంగంలో గ‌తేడాదితో పోల్చితే అత్య‌ధికంగా 17శాతం పెరుగుద‌ల న‌మోద‌య్యింది. గృహ రుణాల వాటా రూ.13.3 ల‌క్ష‌ల కోట్లు. ఈ రంగంలో 14.8శాతం పెరుగుద‌ల న‌మోద‌య్యింది. ఇత‌ర రుణాలు రూ.7ల‌క్ష‌ల కోట్లుగా ఉంద‌ని ఆర్బీఐ తెలిపింది. వ్య‌క్తిగ‌త రుణాలు ఇచ్చిన సంస్థ‌ల్లో ఎక్కువ‌శాతం నాన్ బ్యాంకింగ్ సంస్థ‌లే ఉన్నాయి. 


logo