ఆదివారం 07 జూన్ 2020
Business - Mar 31, 2020 , 18:28:57

ఎస్బీఐ ఉద్యోగుల విరాళం 100 కోట్లు

ఎస్బీఐ ఉద్యోగుల విరాళం 100 కోట్లు

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి ఆర్థిక మద్దతు లభిస్తున్నది. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ ఉద్యోగులు తమ రెండురోజుల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. బ్యాంకులోని 256000 మంది ఉద్యోగుల రెండు రోజుల వేతనాలు మొత్తం రూ.100కోట్లు పీఎం కేర్‌కు ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ రజినీష్‌ కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనాను ఎదుర్కోవటంలో ప్రభుత్వానికి అన్నిరకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు.   


logo