బుధవారం 03 జూన్ 2020
Business - Mar 31, 2020 , 10:32:40

కరోనాతో కోటి మంది పేదరికంలోకి..

కరోనాతో కోటి మంది పేదరికంలోకి..

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా వారి జీవన స్థితిగతులపై కూడా దారుణంగా ప్రభావం చూపుతున్నదని ప్రపంచబ్యాంకు తెలిపింది. ఒక్క తూర్పు ఆసియాలోనే కరోనా సంక్షోభం కారణంగా కోటీ 10 లక్షల మంది పేదరికంలోకి జారిపోనున్నారని వెల్లడించింది. ఈ వ్యాధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద షాక్‌లాంటిదని, తూర్పు ఆసియాలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు తూర్పు ఆసియా పరిసిఫిక్‌ ప్రాంత ప్రధాన ఆర్థిక వేత్త ఆదిత్య మట్టూ తెలిపారు. ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిరేటు తీవ్రంగా పడిపోతుందని విశ్లేషించారు. చైనా ఆర్థిక వృద్ధి కూడా 2019లో 6.1శాతం ఉండగా ఈ ఏడాది అది 2.3శాతానికి పడిపోవచ్చని తెలిపారు.

ప్రపంచంలో నేడు ఐదింట రెండొంతుల మంది లాక్‌డౌన్‌లో ఉండటంతో వ్యాపారాలన్నీ మూతపడ్డాయని, కోవిడ్‌-19 పుట్టినిల్లయిన చైనా ఈ సమస్యనుంచి బయటపడినప్పటికీ ఆర్థికపరంగా మాత్రం తీవ్రంగా నష్టపోక తప్పదని తెలిపారు. చైనా ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 5.9శాతంగా ఉండవచ్చని రెండు నెలల క్రితమే ప్రపంచబ్యాంకు అంచనావేసింది. కానీ కరోనా కారణంగా దాన్ని 2.3శాతానికి తగ్గించింది.  

 


logo