బుధవారం 03 జూన్ 2020
Business - Mar 30, 2020 , 15:16:09

ఈఎంఐ కట్టకున్నా డిఫాల్ట్ కాదు

ఈఎంఐ కట్టకున్నా డిఫాల్ట్ కాదు

కరోనా అత్యవసర పరిస్థితి కారణంగా బ్యాంకు లోన్ల రీపేమెంట్‌, ఈఎంఐలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మూడు నెలల మారటోరియం విధించటంతో క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలకు సెబీ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణగ్రహీతలు ఒకవేళ ఈ మూడు నెలల్లో రుణాలు చెల్లించకపోయినా డిఫాల్ట్‌ అయినట్లుగా పరిగణించరాదని క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలకు సూచించింది. ‘క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ వినియోగదారుని రుణ చెల్లింపు విశ్లేషణలో భాగంగా ఎవరైనా రుణగ్రహీత వచ్చే మూడు నెలల్లో తాను తీసుకున్న రుణంపై చెల్లించాల్సిన వడ్డీగానీ అసలుగానీ సకాలంలో చెల్లించలేకపోయినప్పటికీ దానిని డిఫాల్ట్‌ అయినట్లుగా పరిగణించరాదు’ అని రేటింగ్‌ సంస్థలకు జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ విధానం ఆర్‌బీఐ నిర్దేశించిన కాలపరిమితి వరకు కొనసాగుతుందని తెలిపింది. 


logo