శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Mar 26, 2020 , 23:29:16

‘లాక్‌డౌన్‌ ఒక్కటే సరిపోదేమో’

‘లాక్‌డౌన్‌ ఒక్కటే సరిపోదేమో’

న్యూఢిల్లీ, మార్చి 26: భారత్‌లో కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే సరిపోకపోవచ్చని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని బ్లూంబర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దేశంలో ఎంతోమంది పేదలున్నారని, ఇండ్లకే పరిమితం కావాలంటే సర్దుకుపోయే పరిస్థితి అందరికీ ఉండదని గుర్తుచేశారు. సామాజిక దూరం తప్పనిసరిగా ఉన్న ఈ అంటువ్యాధి నిర్మూలనకు కలగలిసి ఉండే మురికివాడలు ఆటంకంగా ఉండే వీలుందన్నారు. మౌలిక రంగ సామర్థ్యం మెరుగుపడాలన్న ఆయన వైరస్‌ అంతానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


logo