సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 25, 2020 , 13:09:47

వృద్ధిరేటుకు లాక్‌డౌన్ గండం: బార్‌క్లే

వృద్ధిరేటుకు లాక్‌డౌన్ గండం: బార్‌క్లే

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశం మొత్తం 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర నిర్ణ‌యం తీసుకోవ‌టంతో దాని ప్ర‌భావం దేశ ఆర్థిక వృద్ధిరేటుపై తీవ్రంగా ఉండ‌నుంద‌ని ప్ర‌ముఖ బార్‌క్లే బ్యాంకు తెలిపింది. దేశ వార్శిక వృద్థిరేటు కేవలం 2.5శాతానికే ప‌రిమితం కావ‌చ్చ‌ని అంచ‌నా వేసింది. ఈ ఏడాది దేశ వృద్దిరేటు 4.5శాతం ఉండ‌వ‌చ్చ‌ని గ‌తంలో అంచ‌నా వేశారు. కానీ ఈ ఏప్రిల్ -  జూన్ త్రైమాసికంలో లాక్‌డౌన్ ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంటుంద‌ని బార్‌క్లే తెలిపింది. గ‌తంలో అంచ‌నావేసిన‌దానికి ఏమాత్రం పోలిక ఉండ‌క‌పోవ‌చ్చ‌ని మంగ‌ళ‌వారం రాత్రి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన అనంత‌రం విడుద‌ల చేసిన రిపోర్టులో బార్‌క్లే తెలిపింది. 2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో కూడా ఈ ఉత్పాతం ప్ర‌భావం ఉంటుంద‌ని వెల్ల‌డించింది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం కూడా వృద్ధి రేటు ముందుగా అంచ‌నా వేసిన‌ట్లు 5.2శాతం ఉండ‌ద‌ని, అది కేవ‌లం 3.5శాతానికే ప‌రిమితం అవుతుంద‌ని తెలిపింది.


logo