శనివారం 30 మే 2020
Business - Mar 25, 2020 , 08:39:17

ఉద్యోగులంద‌రికీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇవ్వ‌లేం

ఉద్యోగులంద‌రికీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇవ్వ‌లేం

కోవిడ్ మ‌హ‌మ్మారి వ్యాపించ‌కుండా కంపెనీల‌న్నీ ఉద్యోగులకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ పెట్ట‌డంతో ఈ విధానం త‌మ‌కు చాలా ఇబ్బందులు తెచ్చి పెడుతున్న‌ద‌ని ప‌లు ఐటీ కంపెనీల అధిప‌తులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ల‌భించిన రంగాల్లో ఐటీ లేక‌పోవ‌టంతో ఆయా ఉద్యోగులంద‌రూ ఇండ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌స్తున్న‌ది. దాంతో తాము జాతీయ అంత‌ర్జాతీయ క్ల‌యింట్ల‌కు సేవ‌లు అందించ‌టంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని భార‌తీయ ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌లు టీసీఎస్‌, ఇన్‌ఫోసిస్ సీఈవోలు సోష‌ల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర సేవ‌లు అందిస్తున్న ప‌లు ప్ర‌భుత్వ, ప్రైవేటు సంస్థ‌ల‌కు త‌మ సేవ‌లు ఆగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, అందువ‌ల్ల కొంత‌మంది ఉద్యోగులైనా ఆఫీసు నుంచి ప‌నిచేయాల్సిందేన‌ని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథ‌న్ పేర్కొన్నారు.  


logo