శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 24, 2020 , 15:20:20

హీరో సైకిల్స్ క‌రోనా నిధి

హీరో సైకిల్స్ క‌రోనా నిధి

క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు రూ.100కోట్ల‌తో అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు హీరో సైకిల్స్ కంపెనీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. కంపెనీతో క‌లిసి ప‌నిచేస్తున్న‌వారితోపాటు స‌మాజ హితం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సంస్థ చైర్మ‌న్ పంక‌జ్ ఎం ముంజ‌ల్ ప్ర‌క‌టించారు. మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్యాపారం చేయాల‌న్న సంస్థ నియ‌మాన్ని అనుస‌రించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. అవ‌స‌ర‌మైన స‌హాయం అందించేందుకు వివిధ రాష్ర్ట ప్ర‌భుత్వాల‌ను కూడా సంప్ర‌దించామ‌ని వెల్ల‌డించారు. క‌రోనా వ‌ల్ల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు పరిశీలించేందుకు ముంజ‌ల్ నేతృత్వంలో సంస్థ అత్య‌వ‌స‌ర ప‌ర్య‌వేక్ష‌ణ సెల్‌ను ఏర్పాటు చేసింది. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టంతో సంస్థ స‌ప్లైచైన్ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారు. logo