బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 18, 2020 , 00:36:13

రూ.650 కోట్లతో శ్రీసిటీలో ప్లాంట్‌

రూ.650 కోట్లతో శ్రీసిటీలో ప్లాంట్‌

-పానసోనిక్‌ లైఫ్‌ సొల్యుషన్స్‌ ఎండీ వివేక్‌ శర్మ

హైదరాబాద్‌, మార్చి 17: యాంకర్‌ పేరుతో విద్యుత్‌ పరికరాలను విక్రయిస్తున్న పానసోనిక్‌ లైఫ్‌ సొల్యుషన్స్‌..హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్‌ను ప్రారంభించింది. 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వివేక్‌ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌క్లూజివ్‌ అవుట్‌లెట్‌ను ప్రారంభించినట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశవ్యాప్తంగా 130 స్టోర్లను నెలకొల్పనున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీలోని శ్రీసిటీ వద్ద రూ.650 కోట్ల పెట్టుబడితో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్లాంట్‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,800 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం సంస్థకు ఏడు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. 


logo