ఆదివారం 24 మే 2020
Business - Jan 18, 2020 , 00:57:57

గోల్డ్‌ లోన్‌ మార్కెట్‌ రయ్‌.. రయ్‌

 గోల్డ్‌ లోన్‌ మార్కెట్‌ రయ్‌.. రయ్‌
  • -2022 నాటికి రూ.4,61,700 కోట్లకు పెరగొచ్చు: కేపీఎంజీ

న్యూఢిల్లీ, జనవరి 17: భారతీయ గోల్డ్‌ లోన్‌ మార్కెట్‌ 2022 నాటికి రూ.4,617 బిలియన్ల (రూ.4,61,700 కోట్లు)ను తాకవచ్చని కేపీఎంజీ రిపోర్టు అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే సంస్థలు దేశవ్యాప్తంగా తమ శాఖలను పెద్ద ఎత్తున విస్తరించాయని, ఉత్తర, తూర్పు రాష్ర్టాల్లో మరీ ఎక్కువైపోయాయని తెలిపింది.


బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, కొత్తకొత్తగా వస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థలు.. ఆన్‌లైన్‌, డిజిటల్‌ విధానాల్లో బంగారు రుణాలను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని, కస్టమర్ల వద్దకే వెళ్లి సేవలను అందిస్తున్నాయని చెప్పింది. దేశీయ గోల్డ్‌ లోన్‌ మార్కెట్‌లో దాదాపు 35 శాతం బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, నిధి కంపెనీలదేనని కేపీఎంజీ తెలియజేసింది. ఈ క్రమంలోనే 13.4 శాతం వార్షిక వృద్ధి సాయంతో 2022 నాటికి రూ.4,617 బిలియన్లకు చేరే అవకాశాలున్నాయని ‘భారతీయ వ్యవస్థీకృత రుణ మార్కెట్‌లో గోల్డ్‌ ఫైనాన్షియర్స్‌ పునర్‌ వైభవం’ నివేదికలో పేర్కొన్నది. 


logo