గురువారం 09 ఏప్రిల్ 2020
Business - Jan 17, 2020 , 01:21:51

టెల్కోలకు ఎదురుదెబ్బ

టెల్కోలకు ఎదురుదెబ్బ
  • ఏజీఆర్‌ తీర్పు రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు
  • 23లోగా రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాల్సిందే

న్యూఢిల్లీ, జనవరి 16: సుప్రీంకోర్టులో టెలికం సంస్థలకు ఎదురుదెబ్బ తగిలింది. రూ.1.47 లక్షల కోట్ల బకాయిలను టెలికం శాఖకు చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. టెలికం శాఖ నిర్వచించిన సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)ను గతేడాది అక్టోబర్‌ 24న సమర్థిస్తూ టెలికం సంస్థలు రూ.1.47 లక్షల కోట్ల బకాయిలను చెల్లించాలని సుప్రీం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నెల 23లోగా సొమ్మును జమ చేయాలనీ తేల్చిచెప్పింది. ఇది భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తదితర సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేయగా, ఈ సంస్థలన్నీ కలిసి తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, ఎస్‌ఏ నజీర్‌, ఎంఆర్‌ షా నేతృత్వంలో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి గల కారణాలు ఏమీ తమకు కనిపించడం లేదంటూ గతంలో ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కాగా, తమ రివ్యూ పిటిషన్లపై ఓపెన్‌ కోర్టు విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీంను టెల్కోలు కోరగా, దాన్ని కూడా తోసిపుచ్చుతూ ఇన్‌-చాంబర్‌ విచారణే జరిగింది.


బకాయిలు, దానిపై వడ్డీ, జరిమానా, ఆపైనా వడ్డీల పేరుతో టెలికం శాఖకు రూ.1.47 లక్షల కోట్లు ఇవ్వాల్సిందిగా టెలికం సంస్థలను సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన సంగతి విదితమే. టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గతంలో లోక్‌సభలో తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి టెలికం సంస్థలు లైసెన్స్‌ ఫీజు బకాయిలుగా రూ.92,642 కోట్లను ఇవ్వాల్సి ఉన్నది. మరో రూ.55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిలున్నాయి. అంతకుముందు సుప్రీం కోర్టులో దాఖలైన ఓ అఫిడవిట్‌ ప్రకారం ఎయిర్‌టెల్‌ రూ.35,586 కోట్లు, వొడాఫోన్‌ రూ.53,038 కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ.16,456.47 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,098.72 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.2,537.48 కోట్లు లైసెన్స్‌ ఫీజుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని టెలికం శాఖ తెలిపింది. మరికొన్ని సంస్థలూ బకాయిపడ్డాయి.


క్యురేటివ్‌ పిటిషన్లు

సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ల కొట్టివేతపై భారతీ ఎయిర్‌టెల్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయంలో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలుకున్న సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని పేర్కొన్నది. ‘సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇదే సమయంలో మా అసంతృప్తినీ తెలియజేస్తున్నాం. క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలుకున్న అవకాశాలను అంచనా వేస్తున్నాం. టెలికం పరిశ్రమ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నది. సుప్రీం తీర్పు మా కష్టాలను పెంచేసింది’ అని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వొడాఫోన్‌ ఐడియా సైతం క్యూరేటివ్‌ పిటిషన్‌పై యోచిస్తున్నది. ఈ మేరకు సంస్థ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలిపింది. వొడాఫోన్‌ ఐడియా రుణ భారం రూ.1.17 లక్షల కోట్లుగా ఉండగా, సుప్రీం తీర్పుతో సంస్థ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. కాగా, ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. తమ కన్జ్యూమర్‌ మొబిలిటీ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు టాటా టెలీసర్వీసెస్‌ అమ్మేసిన విషయం తెలిసిందే. టెలికం శాఖకు ఈ సంస్థ రూ.13,823 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇది కూడా ఇప్పుడు ఎయిర్‌టెల్‌ ఖాతాలోకే చేరింది. మొత్తం 15 సంస్థలు రూ.1.47 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. ఈ చెల్లింపులకున్న గడువు మరో వారం రోజులే. సుప్రీం తీర్పు నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా.. భారతీయ కార్పొరేట్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ.50,922 కోట్ల త్రైమాసిక నష్టాలను ప్రకటించగా, ఎయిర్‌టెల్‌ రూ.23,045 కోట్ల నష్టాలను ప్రకటించినది తెలిసిందే. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కాల్స్‌, డేటా చార్జీలనూ ఈ సంస్థలు పెంచినదీ విదితమే.


గెయిల్‌, పవర్‌గ్రిడ్‌ల నుంచీ..

ప్రభుత్వ రంగ సంస్థలైన గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, ఆయిల్‌ ఇండియా తదితర కంపెనీల నుంచీ టెలికం శాఖకు సుమారు రూ.2.4 లక్షల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. తమ పైప్‌లైన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్ల వెంట ఆప్టిక్‌ ఫైబర్‌ ద్వారా బ్రాడ్‌బాండ్‌ వర్తకానికి వీలుగా లైసెన్సులను పొందాయి. ఈ క్రమంలోనే టెలికం శాఖకు గెయిల్‌ రూ.1.72 లక్షల కోట్లు, పవర్‌గ్రిడ్‌ రూ.21 వేల కోట్లు, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.40 వేల కోట్లు బకాయిపడ్డాయి. అయితే గెయిల్‌, పవర్‌గ్రిడ్‌లకు డిమాండ్‌ నోటీసులు పంపలేదని, మదింపు లేదా అంచనా ఆదేశాలను మాత్రమే జారీ చేశామని టెలికం శాఖ వర్గాలు చెబుతున్నాయి. రూ.15,097 కోట్ల బకాయి కోసం జీఎన్‌ఎఫ్‌సీకి డిమాండ్‌ నోటీసును పంపించారు.


జియో దూకుడు

రిలయన్స్‌ జియో మరో ప్రభంజనం సృష్టించింది. టెలికం సేవలు ఆరంభించి మూడున్నరేండ్లలోనే దేశంలో అతిపెద్ద సంస్థగా అవతరించింది. నవంబర్‌ 2019 నాటికి 36.9 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులతో ఈ రికార్డును సాధించిందని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ గురువారం తాజాగా వెల్లడించింది. తన పోటీ సంస్థయైన వొడాఫోన్‌ ఐడియా 33.62 కోట్ల కస్టమర్లతో రెండో స్థానానికి పడిపోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 32.72 కోట్లతో ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాయి. మొత్తంమీద గతేడాది నవంబర్‌ చివరినాటికి టెలిఫోన్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు తగ్గారు. అక్టోబర్‌ చివరినాటికి ఈ సంఖ్య 120.48 కోట్లుగా ఉన్నారు. టెలికం వినియోగదారుల్లో అత్యధిక మంది మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు ఉండగా, వీరి సంఖ్య కూడా 2.43 శాతం తగ్గి 115.43 కోట్లకు పరిమితమయ్యారని నివేదిక వెల్లడించింది. అంతక్రితం నెలలో 118.34 కోట్లుగా ఉన్నారు.


వొడాఫోన్‌ ఐడియా అత్యధిక మంది మొబైల్‌ వినియోగదారులను కోల్పోయినట్లు ట్రాయ్‌ తాజాగా వెల్లడించింది. వొడాఫోన్‌ ఐడియా ఏకంగా 3.6 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. కానీ, రిలయన్స్‌ జియో 56 లక్షల మంది నూతన కస్టమర్లను ఆకట్టుకోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 16.59 లక్షలు, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 3.41 లక్షల మంది కస్టమర్లు ఎంచుకున్నారు. అలాగే, ఫిక్స్‌డ్‌ లైన్‌ కనెక్షన్లు కూడా 2.14 కోట్ల నుంచి 2.12 కోట్లకు తగ్గారు. కోల్పయిన సంస్థల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ అగ్రస్థానంలో ఉన్నది. 1.64 లక్షల ఫిక్స్‌డ్‌ లైన్‌ కనెక్షన్లు తగ్గడంతో కస్టమర్ల సంఖ్య కోట్ల నుంచి లక్షల్లోకి 98.30 లక్షల్లోకి పడిపోయింది. ఇదే సమయంలో రిలయన్స్‌ జియో కస్టమర్లు తొలిసారిగా 7 డిజిట్‌ సంఖ్య అయిన 10.23 లక్షలకు చేరుకున్నది. 2.67 శాతం పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 66.12 కోట్లకు చేరుకున్నారు. 98.99 శాతం మార్కెట్‌ వాటాను కలిగివున్నాయి తొలి ఐదు సేవలు సంస్థలు. వీరిలో రిలయన్స్‌ జియోకు 37 కోట్ల సబ్‌స్ర్కైబర్లు ఉండగా, భారతీ ఎయిర్‌టెల్‌ 13.99 కోట్ల మంది, వొడాఫోన్‌ ఐడియాకు 11.98 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2.25 కోట్లు ఉన్నారు.

జియో దూకుడు

రిలయన్స్‌ జియో మరో ప్రభంజనం సృష్టించింది. టెలికం సేవలు ఆరంభించి మూడున్నరేండ్లలోనే దేశంలో అతిపెద్ద సంస్థగా అవతరించింది. నవంబర్‌ 2019 నాటికి 36.9 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులతో ఈ రికార్డును సాధించిందని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ గురువారం తాజాగా వెల్లడించింది. తన పోటీ సంస్థయైన వొడాఫోన్‌ ఐడియా 33.62 కోట్ల కస్టమర్లతో రెండో స్థానానికి పడిపోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 32.72 కోట్లతో ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాయి. మొత్తంమీద గతేడాది నవంబర్‌ చివరినాటికి టెలిఫోన్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు తగ్గారు. అక్టోబర్‌ చివరినాటికి ఈ సంఖ్య 120.48 కోట్లుగా ఉన్నారు. టెలికం వినియోగదారుల్లో అత్యధిక మంది మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు ఉండగా, వీరి సంఖ్య కూడా 2.43 శాతం తగ్గి 115.43 కోట్లకు పరిమితమయ్యారని నివేదిక వెల్లడించింది. అంతక్రితం నెలలో 118.34 కోట్లుగా ఉన్నారు. వొడాఫోన్‌ ఐడియా అత్యధిక మంది మొబైల్‌ వినియోగదారులను కోల్పోయినట్లు ట్రాయ్‌ తాజాగా వెల్లడించింది. వొడాఫోన్‌ ఐడియా ఏకంగా 3.6 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది.


కానీ, రిలయన్స్‌ జియో 56 లక్షల మంది నూతన కస్టమర్లను ఆకట్టుకోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 16.59 లక్షలు, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 3.41 లక్షల మంది కస్టమర్లు ఎంచుకున్నారు. అలాగే, ఫిక్స్‌డ్‌ లైన్‌ కనెక్షన్లు కూడా 2.14 కోట్ల నుంచి 2.12 కోట్లకు తగ్గారు. కోల్పయిన సంస్థల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ అగ్రస్థానంలో ఉన్నది. 1.64 లక్షల ఫిక్స్‌డ్‌ లైన్‌ కనెక్షన్లు తగ్గడంతో కస్టమర్ల సంఖ్య కోట్ల నుంచి లక్షల్లోకి 98.30 లక్షల్లోకి పడిపోయింది. ఇదే సమయంలో రిలయన్స్‌ జియో కస్టమర్లు తొలిసారిగా 7 డిజిట్‌ సంఖ్య అయిన 10.23 లక్షలకు చేరుకున్నది. 2.67 శాతం పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 66.12 కోట్లకు చేరుకున్నారు. 98.99 శాతం మార్కెట్‌ వాటాను కలిగివున్నాయి తొలి ఐదు సేవలు సంస్థలు. వీరిలో రిలయన్స్‌ జియోకు 37 కోట్ల సబ్‌స్ర్కైబర్లు ఉండగా, భారతీ ఎయిర్‌టెల్‌ 13.99 కోట్ల మంది, వొడాఫోన్‌ ఐడియాకు 11.98 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2.25 కోట్లు ఉన్నారు.


logo