బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 31, 2020 , 01:18:29

పరిశోధనలకు రూ.200 కోట్లు: ఐఐటీ హైదరాబాద్‌

పరిశోధనలకు రూ.200 కోట్లు: ఐఐటీ హైదరాబాద్‌

కంది, నమస్తే తెలంగాణ: వచ్చే ఐదేండ్లలో పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రస్తుతం ఏటా రూ.50 కోట్ల వరకు ఆర్‌ అండ్‌ డీ కోసం వెచ్చిస్తున్నట్లు, 2024 నాటికి దీనిని రూ.200 కోట్ల వరకు పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో ఐఐటీ క్యాంపస్‌లో ఇంక్యూబేషన్‌ పార్క్‌ను సైతం నెలకొల్పనున్నట్లు ప్రకటించిన ఆయన..ఈ సెంటర్‌లో 40 కంపెనీలు, 50 స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌ల జాబితాలో 600 నుంచి 800 మధ్యలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌..దీనిని టాప్‌-400 లోపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.


logo