మంగళవారం 14 జూలై 2020
Business - Jun 30, 2020 , 00:25:39

అమెజాన్‌లో 20 వేల ఉద్యోగాలు

అమెజాన్‌లో 20 వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: అమెజాన్‌ ఇండియా తమ కస్టమర్‌ సర్వీస్‌ విభాగంలో దాదా పు 20 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌ సహా 11 నగరాల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. చాలా ఉద్యోగాలు ‘వర్క్‌ ఫ్రం హోం’ క్యాటగిరీలోనే ఉంటాయని తెలిపింది. ఇంటర్‌ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలపై పట్టున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అమెజాన్‌ ఇండియా వివరించింది.


logo