శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Nov 28, 2020 , 02:41:14

మ్యాక్స్‌ లైఫ్‌లో 2 వేల ఉద్యోగాలు

మ్యాక్స్‌ లైఫ్‌లో 2 వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటైన మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌...ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఏకంగా 2 మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నది. కరోనా సమయంలో ఏకంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం విశేషం. దీంతో సంస్థలో ఉద్యోగుల సంఖ్య 15 వేలకు చేరుకున్నారు. ఏజెన్సీ, బ్యాంక్‌అస్యూరెన్స్‌, అంతర్గత ఆపరేషన్‌ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా డిజిటల్‌ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గత ఆరు నెలల్లో 500 మంది టెక్నాలజీ నిపుణులను రిక్రూట్‌ చేసుకున్నది. 

VIDEOS

logo