శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 21, 2020 , 01:33:47

2.5 కోట్ల వ్యాపారుల లక్ష్యం: పేటీఎం

2.5 కోట్ల వ్యాపారుల లక్ష్యం: పేటీఎం

హైదరాబాద్‌, జనవరి 20: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సేవల సంస్థ పేటీఎం..వ్యాపారస్తులను పెంచుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే 1.5 కోట్ల మంది మర్చెంట్లు ఉండగా, వచ్చే ఏడాది ఈ సంఖ్యను 2.5 కోట్లకు పెంచుకోనున్నట్లు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సౌరబ్‌ శర్మ తెలిపారు. వ్యాపారస్తుల కోసం ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్‌ సేవలను దక్షిణాది రాష్ర్టాల్లో భాగంగా తొలుత తెలంగాణలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫాం కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 15 లక్షల మంది మర్చెంట్లు ఉండగా, వచ్చే ఏడాది కాలంలో ఈ సంఖ్యను రెండు రెట్లు పెంచాలనుకుంటున్నట్లు శర్మ చెప్పారు. పేటీఎం వ్యాలెట్‌, రూపే కార్డులు, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్‌ల ద్వారా అపరిమిత చెల్లింపులకు ఈ క్యూఆర్‌ ద్వారా అవకాశం లభించనున్నదని, అలాగే  ఎలాంటి చార్జీల్లేకుండానే వ్యాపారులు తమ బ్యాంక్‌ ఖాతాల్లో నగదును జమ చేసుకోవచ్చునన్నారు. వచ్చే పదిహేను రోజుల్లో ఈ క్యూర్‌ కోడ్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. 


logo