గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 14, 2021 , 02:11:42

చిన్న స్టాకులు అదరహో

చిన్న స్టాకులు అదరహో

  • 30 శాతం వరకు పెరిగిన షేరు విలువ
  • 10 రోజుల్లో 19వేల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

ముంబై, ఫిబ్రవరి 13: స్టాక్‌ మార్కె ట్లు కదం తొక్కుతున్నాయి. బడ్జెట్‌ ర్యాలీతో సూచీలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. బ్లూచిప్‌ సంస్థ లు ఆశాజనక పనితీరు కనబరుస్తుంటే చిన్న, మధ్య స్థాయి స్టాకులు రాకెట్‌ వేగంతో ముందుకు సాగుతున్నాయి. గత రెండు వారాల్లో బీఎస్‌ఈ 500లో ఉన్న 40 చిన్న, మధ్య స్థాయి స్టాకులు ఏకంగా 40% వరకు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 51 వేల పైకి, నిఫ్టీ 15 వేల పాయింట్లపైకి చేరుకున్నాయి. మౌలిక రంగానికి కేంద్రం భారీగా నిధులను వెచ్చిస్తుండటంతో చిన్న, మధ్య స్థాయి రంగాలకు చెందిన షేర్లకు ఎనలేని డిమాండ్‌ నెలకొన్నదని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు మరింత జోష్‌ ఇస్తున్నాయి. ఈ నెలలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రూ.19 వేల కోట్ల నిధులను కుమ్మరించారు. ఫలితంగా చిన్న స్థాయి స్టాకులతోపాటు బ్లూచిప్‌ సంస్థలైన టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, డాబర్‌లు కూడా మదుపరులను ఆకట్టుకున్నాయి.


VIDEOS

logo