శనివారం 28 నవంబర్ 2020
Business - Nov 22, 2020 , 01:00:12

28 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టులకు 107 కోట్లు

28 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టులకు 107 కోట్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్మించతలపెట్టిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం రూ.107.42 కోట్ల నిధులను విడుదల చేసింది. పది రాష్ర్టాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు విలువ రూ.320 కోట్లు కాగా, వీటిలో రూ.107.42 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మధ్యప్రదేశ్‌తోపాటు గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి ప్రతిరోజు 1,237 టన్నులు ఉత్పత్తి కానున్నది.