గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 26, 2021 , 01:46:01

100 నోట్ల రద్దు లేదు

100 నోట్ల రద్దు లేదు

అవి తప్పుడు వార్తలే: ఆర్బీఐ

న్యూఢిల్లీ, జనవరి 25: ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను త్వరలో ఉపసంహరించనున్నట్లు వస్తున్న వార్తలపై రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) స్పష్టత ఇచ్చింది. అవి తప్పుడు వార్తలని సోమవారం ట్వీట్‌ చేసింది. ఈ మూడు రకాల నోట్ల చలామణి యథాతథంగానే కొనసాగుతుందని, వీటిని భవిష్యత్తులోనూ రద్దు చేసేది లేదని తేల్చిచెప్పింది. నోట్ల రద్దుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. కొత్త నోట్లతోపాటు పాత నోట్లను కూడా చలామణిలో ఉంచుతామని ఆర్బీఐ స్పష్టం చేసింది.

VIDEOS

logo