బుధవారం 27 మే 2020
Business - Apr 04, 2020 , 02:34:34

బిగ్‌బాస్కెట్‌లో 10 వేల ఉద్యోగాలు

బిగ్‌బాస్కెట్‌లో 10 వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్‌ దెబ్బకు ఉద్యోగాలు పోతుంటే మరోవైపు ప్రముఖ సరుకుల రవాణా సదుపాయాల సంస్థ బిగ్‌బాస్కెట్‌ మా త్రం భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సరుకుల రవాణా కోసం దేశవ్యాప్తంగా 10 వేల మందిని రిక్రూట్‌ చేసుకోబోతున్నట్లు తెలిపింది. గిడ్డంగులు, లాస్ట్‌-మైల్‌ డెలివరి అవసరాల నిమిత్తం 26 నగరాల్లో పది వేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బిగ్‌బాస్కెట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(మానవ వనరులు) తనుజా తివారీ తెలిపారు. 


logo