శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 22, 2020 , 02:51:14

కరోనాతో 10 లక్షల కోట్ల నష్టం

కరోనాతో 10 లక్షల కోట్ల నష్టం

  • ఎఫ్‌టీసీసీఐ వెబినార్‌లో బీమా రంగ ప్రముఖులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ కారణంగా దేశంలోని అన్ని రంగాలకు రూ.10 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పలు బీమా సంస్థల ప్రముఖులు అన్నారు. ‘కొవిడ్‌-19 మహమ్మారి, ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ రెస్పాన్స్‌' అంశంపై మంగళవారం ఇక్కడ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), విశిష్ట ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సొల్యూషన్స్‌ ఆధ్వర్యంలో వెబినార్‌ నిర్వహించారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి మాట్లాడుతూ.. కరోనాతో ఉద్యోగాలు, జీవనోపాధి కోల్పొయినవారిని ఆదుకునేలా బీమా పాలసీలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసెస్‌ సీవోవో పద్మారావు సివెల్లా, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ జనరల్‌ నాగరాజు శర్మ తదితరులు పాల్గొన్నారు.  


logo