ముంబై, మే 28: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. వాహన రుణాలకు సంబంధించిన నియమ నిబంధనలు అతిక్రమించినందుకుగాను బ్యాంక్‌పై రూ.10 కోట్ల జరిమానా విధించింది సెంట్రల్ బ్యాంక్. విస్టేబ్లోవర్ ఇచ్చిన ఫిర్యాదు పరిశీలించిన తర్వాత ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది.