బుధవారం 20 జనవరి 2021
Business - Aug 21, 2020 , 00:02:52

రూ.1,492 తగ్గిన బంగారం ధర

రూ.1,492 తగ్గిన బంగారం ధర

  • రెండు రోజుల్లో రూ.5వేల వరకు క్షీణించిన కిలో వెండి

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం 10 గ్రాముల పసిడి రూ.1,492 దిగింది. దీంతో ఢిల్లీ మార్కెట్‌లో తులం విలువ రూ.52,819 వద్దకు చేరింది. బుధవారం రూ.54,311 పలికిన విషయం తెలిసిందే. వెండి ధర కూడా కిలో రూ.1,476 పడిపోయి రూ.67,924 వద్ద స్థిరపడింది. అంతకుముందు రూ.69,400లుగా ఉన్నది. బుధవారం రూ.3,112 మేర వెండి ధర పతనమైన సంగతి విదితమే. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు పుత్తడి 1,927 డాలర్లుగా ఉంటే, వెండి 26.71 డాలర్లుగా ఉన్నది. గ్లోబల్‌ మార్కెట్‌లో డాలర్‌ విలువ బలపడటం బంగారానికి మదుపరులలో డిమాండ్‌ను తగ్గించిందని ట్రేడర్లు చెప్తున్నారు.


logo