న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: గృహ రుణాలు అందించే ప్రైవేట్ సంస్థ ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ కంపెనీ..ఈ ఏడాది చివరినాటికి 600 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలు చేపట్టినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా చౌక గృహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో బ్రాంచ్‌లను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. వేతన జీవులు, కిరాణాదుకాణాదారులు, ట్రేడర్లు, వ్యాపారులు, కూరగాయలు- పండ్లు విక్రయించేవారు, డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, కార్పెంటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.