e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home తెలంగాణ తెలంగాణలో డెక్కన్‌ గ్రెయింజ్‌ ప్లాంట్‌

తెలంగాణలో డెక్కన్‌ గ్రెయింజ్‌ ప్లాంట్‌

  • 15 కోట్లతో రైస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (నమస్తే తెలంగాణ): డెక్కన్‌ రైస్‌ బ్రాండ్‌ పేరుతో బియ్యం ఎగుమతులు చేస్తున్న డెక్కన్‌ గ్రెయింజ్‌ సంస్థ.. రాష్ట్రంలో రైస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్దనున్న టీఎస్‌ఐఐసీకి చెందిన జనరల్‌ పార్కులో ఈ ప్లాంట్‌ను నెలకొల్పింది. రూ.15 కోట్ల పెట్టుబడితో తెచ్చిన ఈ కొత్త ప్లాంట్‌ ప్రాసెసింగ్‌ సామర్థ్యం నెలకు 5వేల టన్నులు. ప్లాంట్‌ నిర్మాణంలో జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు బుధవారం సంస్థ తెలియజేసింది. అన్ని పనులు పూర్తయ్యాయని, ప్రారంభానికి సిద్ధంగా ఉందని డెక్కన్‌ గ్రూప్‌ సీఎండీ కిరణ్‌ పోలా తెలిపారు. ఈ ప్లాంట్‌తో ప్రత్యక్షంగా 60 మందికి ఉద్యోగాలు లభించనుండగా, పరోక్షంగా మరెందరికో ఉపాధి దొరకనున్నది. కాగా, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లకు ‘డెక్కన్‌ రైస్‌’ బ్రాండ్‌ పేరుతో సోనా మ సూరి, ఇతర రకాల ప్రీమియం క్వాలి టీ బియ్యాన్ని సంస్థ ఎగుమతి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.200 కోట్ల రెవిన్యూ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిరణ్‌ చెప్పారు. అలాగే ఎగుమతుల ఆదాయాన్ని రూ.100 కోట్లుగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana