బుధవారం 27 మే 2020
Beauty-tips - May 19, 2020 , 18:19:12

పొట్ట రావ‌ద్దంటే ఏం తినొద్దో తెలుసా..?

పొట్ట రావ‌ద్దంటే ఏం తినొద్దో తెలుసా..?

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రూ స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉండాల‌ని కోరుకుంటారు. యువ‌త‌లో ఈ కోరిక మ‌రీ ఎక్కువ‌. అందుకే స‌న్న‌గా క‌న‌బ‌డ‌టం కోసం రోజూ వాకింగ్‌, జాగింగ్‌, ర‌న్నింగ్ అంటూ ఎన్నో క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. ఎంత చేసినా పొట్ట స‌న్న‌బ‌డ‌టం లేదంటూ నిరాశ చెందుతుంటారు. వాస్త‌వానికి మ‌నిషి పొట్ట పెరుగ‌కూడ‌దంటే కేవ‌లం వ్యాయామం స‌రిపోదు. వ్యాయామంతోపాటుగా కొన్ని ఆహార‌పు అల‌వాట్ల‌ను మార్చుకోవాలి. పొట్ట‌రావ‌డానికి కార‌ణ‌మ‌య్యే ప‌దార్థాల జోలికి వెళ్ల‌కూడ‌దు. మ‌రి పొట్ట రావడానికి కారణమయ్యే కొన్ని పదార్థాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా..? 

1. ఫాస్ట్ ఫుడ్: ఫాస్ట్ ఫుడ్ అనే మాట వింటే చాలు మ‌న‌కు నోరూరుతుంది. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్‌కు ఊబకాయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందువ‌ల్ల పొట్ట త‌గ్గాలంటే ఫాస్ట్‌ఫుడ్‌ను ప‌క్క‌న పెట్టాల్సిందే. 

2. చ‌క్కెర‌: నోటికి తీపిగా ఉండే ఈ ప‌దార్థం మ‌న శ‌రీరానికి మాత్రం తీవ్ర హాని చేస్తుంది. ఒక క‌ప్పు చ‌క్కెర‌లో 773 క్యాల‌రీస్ ఉంటాయి. దీనివ‌ల్ల ఊబకాయం రావ‌డ‌మే కాకుండా మధుమేహం వంటి ఇత‌ర రోగాలు కూడా అంటుకుంటాయి. కాబ‌ట్టి పొట్ట రావ‌ద్దంటే చ‌క్కెర తినొద్దు.

3. ఆలుగ‌డ్డ‌లు: అందరికి బాగా న‌చ్చే కూర‌గాయ ఈ ఆలుగ‌డ్డ‌. ఫ్రై చేసుకున్నా, ఉడ‌క‌బెట్టి వండుకున్నా దాని రుచే వేరు. కానీ ఈ ఆలుగ‌డ్డ‌లో కూడా క్యాల‌రీస్ ఎక్కువ‌గా ఉంటాయి. ఒక ఎగ్ సైజు ఆలుగ‌డ్డ‌లో 163 క్యాల‌రీలు ఉంటాయి. అంటే ఆలుగ‌డ్డ ఎంత తింటే మ‌న‌కు పొట్ట అంత ఎక్కువవుతుంది. 

4. కూల్‌డ్రింక్స్: కూల్‌డ్రింక్స్ కూడా ఊబ‌కాయానికి దారితీస్తాయి. 12 ఔన్స్ డ్రింక్‌లో దాదాపు 140 క్యాలరీస్‌ ఉంటాయి. అందువ‌ల్ల పొట్ట స‌న్న‌గా నాజూగ్గా ఉండాలంటే కూల్‌డ్రింక్స్ జోలికి వెళ్ల‌కూడ‌దు.

 - పొట్ట రావ‌ద్దు అనుకునేవాళ్లు పైన పేర్కొన్న వాటితోపాటు బేక‌రీ ఫుడ్స్‌, దుంప‌లు త‌దిత‌ర ప‌దార్థాల‌కు కూడా దూరంగా ఉండాలి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాలు తీసుకోవాలి.


logo