శుక్రవారం 22 జనవరి 2021
Beauty-tips - Jan 03, 2021 , 17:10:54

గుమ్మడికాయ చర్మానికి చేసే మేలు తెలుసా..?

గుమ్మడికాయ చర్మానికి చేసే మేలు తెలుసా..?

మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి రకరకాల చర్మ సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ స‌మ‌స్య‌ల  నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే మీరు తప్పకుండా గుమ్మడికాయ తినాల్సిందే. దానికంటే ముందు గుమ్మడికాయ, వాటి గింజలు చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోవాల్సిందే... మనకి తెలిసి గుమ్మడికాయ తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. మరి చర్మానికి ఎలా మేలు చేస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..!

1. గుమ్మడికాయలో చర్మం సౌందర్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ చర్మంపై ఎలాంటి మచ్చలు లేకుండా చేయడమే కాక.. స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. 

2. గుమ్మడికాయలోని నియాచిన్, రిబోఫ్లేవిన్, బి6, ఫ్లొయేట్ లాంటివి రక్త ప్రసరణ పెంచి మొటిమలు రాకుండా కాపాడుతుంది. 

3. వీటితో పాటు జింక్, పొటాషియంలు చర్మం ఎర్రబడి వచ్చే మంట, దురద లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

4. గుమ్మడికాయ కొలాజెన్ ఉత్పిత్తిని పెంచి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. అలాగే సాగిపోకుండా కాపాడతుంది. 

5. దీంట్లోని విటమిన్-సి, బెటా-క్యారొటిన్ సూర్మ రష్మి కారణంగా వచ్చే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. 

గుమ్మడికాయలతో కూరలు, పచ్చళ్లే కాకుండా.. జ్యూసులు, స్మూతీలు, సూపులు లాంటివి చేసుకుని కూడా తినచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి

కొవిషీల్డ్ వ‌ర్సెస్ కొవాగ్జిన్‌.. ఏ వ్యాక్సిన్ ధర ఎంత‌?

వ్యాక్సిన్ వ‌చ్చేసింది.. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ల‌కు డీసీజీఐ అనుమ‌తి

ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ డౌటే!

దర్శక నిర్మాతలకు థియేటర్లపై ఇంకా నమ్మకం కుదరలేదా..?


logo