ఒత్తయిన జుట్టు కోసం

జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారా? రకరకాల హెయిర్ ప్యాక్‌లు ట్రై చేశారా? ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ఒత్తయిన జుట్టును సొంతం చేసుకోండి.
క్యారెట్: క్యారెట్ వెంట్రుకలను దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో విటమిన్ బీ7 పుష్కలం. దీన్నే బయోటిన్ అనీ పిలుస్తారు. ఇది కేశాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే, అప్పుడప్పుడూ క్యారెట్ హెయిర్‌ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. దీనికోసం కొన్ని క్యారెట్ ముక్కలను ఉడకబెట్టి, మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వెంట్రుకలు రాలడాన్ని నియంత్రిస్తుంది, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
గ్రీన్ టీ : తలకు గ్రీన్ టీని ప్యాక్‌లా పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం నాలుగైదు గ్రీన్ టీ బ్యాగ్‌లను.. అరలీటరు వేడి నీటిలో వేసి, చల్లారాక నీటిని పక్కన పెట్టుకోవాలి. తలస్నానం తర్వాత ఈ నీటితో తలను బాగా తడపాలి. పది నిమిషాలు గడిచాక శుభ్రంగా కడిగేయాలి. ఇది మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.
మందారం హెయిర్ ప్యాక్: ముందుగా మందార పూలను రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల పెరుగులో ఓ టేబుల్ స్పూన్ మందారం పొడిని కలపాలి. ఇందులో రోజ్ మేరీ ఎస్సెన్స్ కూడా కలుపుకోవచ్చు. ఇది గులాబీ రంగులోకి మారిన తర్వాత, తలకు పట్టించాలి. ఆరాక తలస్నానం చేయాలి.
తాజావార్తలు
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!
- బంగారం వద్దు ఇల్లే ముద్దు.. 70 % మంది మహిళల మనోగతం!
- బొలేరో, ఆటో ఢీ.. ఒకరి మృతి, ఆరుగురికి గాయలు
- కోట్లు పలికిన పదిసెకన్ల వీడియో
- ‘ఓటీఎస్’ గడువు పెంచిన ప్రభుత్వం
- ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ఇద్దరు వ్యక్తులు అరెస్టు