చాలామంది పెదాలు అందంగా, గులాబీ రంగులో మెరిసిపోవాలని కోరుకుంటారు తప్ప, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోరు. పెదాల ఆరోగ్యానికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
హైడ్రేట్ : పెదాల పైనున్న చర్మంలో నూనె గ్రంథులు ఉండవు. అందువల్ల ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేయాలి. పొడిబారకుండా నాణ్యమైన లిప్‌బామ్ ఉపయోగించాలి. పగుళ్లు, పొట్టుపోవడం లాంటి సమస్యలుంటే, రాత్రిళ్లు పెదాలకు నిమ్మరసం, గ్లిజరిన్ మిశ్రమాన్ని పూసుకోవాలి.
మర్దన : వారానికి రెండుసార్లయినా తేనెలో చక్కెర కలిపి పెదాలపై మర్దన చేయాలి. దీనివల్ల మృత
కణాలు దూరమవుతాయి. అలాగే, కొత్తిమీర ముద్దలో నిమ్మరసం కలిపిన మిశ్రమం కూడా పెదాలను
మృదువుగా మారుస్తుంది.
లిప్‌స్టిక్ : నాణ్యమైన లిప్‌స్టిక్ వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఏ లిప్‌స్టిక్ వేసుకోవాలన్నా, ముందు పెదాలకు కొబ్బరి నూనె లేదా లిప్‌బామ్ బేస్‌గా రాసుకుంటే మంచిది. దీనివల్ల అధరాలు ఆరోగ్యంగా ఉంటాయి.