శనివారం 30 మే 2020
Beauty-tips - Jan 27, 2020 , 17:20:20

లెన్స్‌ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

లెన్స్‌ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ఒకప్పుడు కళ్లకు అద్దాలు పెట్టుకోవడానికి యువతరం మొగ్గుచూపేది. ఇప్పుడు వాటికి బదులు లెన్స్‌ పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు యువతులు. అది కూడా దుస్తులకు మ్యాచ్‌ అయ్యేలా లెన్స్‌ పెట్టుకుంటున్నారు. వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

కళ్లజోడు పెట్టుకుంటే ముక్కుపై మచ్చలు పడుతాయని నేటితరం లెన్స్‌పై మొగ్గు చూపుతున్నారు. కొందరైతే దుస్తులకు తగినట్లుగా రంగుల లెన్స్‌ వాడుతున్నారు. జాగ్రత్తగా పెట్టుకుంటే పర్వాలేదు. లెన్స్‌తో అందం ఎంతలా చేకూరుతుందో అంత అప్రమత్తంగా ఉండాలి. లెన్స్‌ ఎప్పుడు ధరించాలంటే.. ముఖం ముందుగా శుభ్రం చేసుకున్న తర్వాత మేకప్‌, మస్కారా.. ఎలా తయారవ్వాలో అలా తయారవ్వాలి. తర్వాత చేతులు శుభ్రం చేసుకొని లెన్స్‌ పొడిగా ఉండేలా చూసుకొని పెట్టుకోవాలి. సాయంత్రం ఇంటికి రాగానే మేకప్‌ తొలిగించాలి. తర్వాతే లెన్స్‌ తీసేయాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. వీటితోపాటు హెయిర్‌ స్ప్రేలూ, లోషన్లు వాడడం మానేయాలి. లెన్స్‌ను పట్టుకునేటప్పుడు చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి.


logo