సోమవారం 13 జూలై 2020
Beauty-tips - Feb 07, 2020 , 14:14:16

చలికాలంలో చక్కని చర్మానికి చిట్కాలు!

చలికాలంలో చక్కని చర్మానికి చిట్కాలు!

ఆధునిక కాలంలో చిన్న, పెద్ద, ఆడ, మగ ప్ర‌తి ఒక్క‌రూ.. అందం, చర్మ సౌందర్యంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి కావల్సిన విధంగా చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల పదార్థాలను వాడుతున్నారు. వాటిలో సహజ సిద్ధమైనవి చాలా తక్కువగానే ఉంటున్నాయి.

-పుదీనా ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసి అందులో గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 40 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం మృదువుగా, తెల్లగా మారుతుంది.

-పుదీనా రసంలో పొప్పడి రసం వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కడిగిన ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. ఇలా తరచూ చేస్తే చర్మం మీది ముడుతలు పోతాయి.

-జామపండుపై ఉన్న తొక్క తీసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత దూదితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

-జామపండు గుజ్జు, పెరుగుని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

-జామపండుని రెండు ముక్కలుగా కోసి అందులోని గింజలని తీసి మెత్తని గుజ్జులా చేయాలి. దీనికి జామ ఆకులను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చర్మంపై జిడ్డు పోతుంది.


logo