సోమవారం 01 జూన్ 2020
Beauty-tips - May 05, 2020 , 20:46:17

బ్యూటీ చాలెంజ్‌ల్లో ఈ చాలెంజ్ వేర‌యా!

బ్యూటీ చాలెంజ్‌ల్లో ఈ చాలెంజ్ వేర‌యా!

ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేస్‌మాస్కుల డిమాండ్ అంద‌రికీ తెలుసు. ప్ర‌తి ఒక్క‌రు దాన్ని ధ‌రించాలి. ఫేస్‌మాస్క్ త‌ప్ప‌ని స‌రి కావ‌డంతో  చివ‌రికి దాన్ని కూడా ఫ్యాష‌న్ పుంతలు తొక్కించారు కొంద‌రు. మ్యాచింగ్ మాస్కులు అనీ,  ప్రింటెడ్ మాస్కులు అని కొత్త కొత్త మాస్కులు క‌నిపిస్తున్నాయి.  మ‌రోవైపు అమ్మాయి కూడా మాస్కులు ధ‌రించడాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. మాస్క్ ధ‌రించినా మేక‌ప్ చెరిగి పోకుండా ఉండేదుకు మార్గాలు క‌నుకున్నారు. అయితే మాస్క్‌ల చుట్టూ వింతైన ప‌రిస్థితులు చేసిన జామి ఫ్రెంచ్ అనే యూట్యూబ్ బ్యూటీ ఆర్టిస్ట్ కొత్త ప్ర‌యోగం చేసింది. ఫేస్‌కి మాస్క్ వేసుకున్న త‌ర్వాత కూడా పెదాలు, ముక్కు క‌నిపించేలా  ఫేస్ ఆర్ట్ వేసుకుంది.  ముక్కుపైనే చిన్న ముక్కు దాని కింద చిన్న పెదాల‌ను చిత్రీక‌రించుకుంది. ఈ మొత్తం మేక‌ప్ వీడియోను సోష‌ల్ మీడియాలో పెట్టింది. ఈ ఆర్ట్ చూప‌రుల‌కు భ్ర‌మ‌ను క‌లిగిన్న‌ది. ఈ వీడియోను త‌క్కువ టైంలోనే 3 ల‌క్ష‌ల మంది చూశారు. దీంతోపాటు ఫ్రెంచ్ ఇత‌రుల‌కు ఛాలెంజ్ విసిరింది. వింత‌గా, ఆస‌క్తిగా ఉండ‌టంతో ఈ బ్యూటీ చాలెంజ్‌ను స్వీక‌రిస్తున్నారు. 
logo