శుక్రవారం 22 జనవరి 2021
Beauty-tips - Dec 27, 2020 , 19:03:58

పాలు ఆరోగ్యానికి మంచివేనా..?

పాలు ఆరోగ్యానికి మంచివేనా..?

పాలు తాగడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ పాలు ద్వారా హార్మోన్ సంబంధిత క్యాన్సర్ లాంటి బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధులతో పాటుగా.. మొటిమలు రావడానికి కారణమవుతాయని మీలో ఎంత మందికి తెలుసు..? పాలు, పాల పదార్థాలు అన్ని సార్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయని అనుకోవడం మన పొరపాటే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి తాగడం వల్ల కలిగే లాభాలేంటి.. నష్టాలేంటి.. రోజుకు ఎంత మేరకు తాగితే మంచిది అన్న విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సి ఉంది.  

పాలు తాగడం వల్ల లాభాలు..

పాలలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరల్లు అధికంగా ఉంటాయి. పాలు, పాల పదార్థాలు రోజుకు మూడు సార్ల చొప్పున తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన క్యాల్షియం, పొటాషియం, విటమిన్-డి అందుతాయట. 

కాల్షియం

ఒక కప్పు పాలలో 300మి.గ్రా క్యాల్షియం కలిగి ఉంటుంది. రోజుకు సగటున 1000మిల్లీ గ్రాముల నుంచి 1200మిల్లీ గ్రాముల వరకూ మనిషి శరీరానికి అవసరం. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. 

- కండరాల సంకోచం

- రక్త నాళాల సడలింపు

- రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ స్రావం

విటమిన్-డి

విటమిన్-డి శరీరానికి క్యాల్షియం, షాస్పరస్ లు అందించేందుకు సహాయపడుతుంది. కప్పు పాలలో 100ఐయూ(ఇంటర్నేషనల్ యూనిట్స్) ఉంటాయి 

రోజుకు దాదాపు 70నుంచి 800ఐయూల వరకు మనిషి శరీరానికి అవసరమవుతుంది. విటమిన్-డి కారణంగా..

- యుముకలు బలంగా ఉంటాయి

-నరాల పనితీరు మెరుగవుతుంది

-రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది

ప్రొటీన్

కప్పు పాలలో ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మనిషికి సాధారణంగా రోజుకు 0.8గ్రాముల నుంచి కిలోగ్రాము వరకూ ప్రొటీన్ అవసరమవుతుంది. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. ప్రొటీన్ కారణంగా..

-ఎముకలు

-కండరాలు

-చర్మం

-రక్తం

-హర్మోన్లు ఆరోగ్యంగా ఉంటాయి.

పాలతో వచ్చే నష్టాలేంటో కూడా చూద్దాం!

పాలు ఆరోగ్యానికి మేలు చేసేవే కానీ.. అవి మితంగా తీసుకున్నప్పుడే. అమితంగా తీసుకోవడం మొదలు పెడితే అనేక రకాల సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఆ సమస్యలేంటంటే.. 

-పాలు, పాల పదార్థాలలోని అన్-సాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదముందట. ఇవి రక్తంలో అనారోగ్య కారణమైన లిపిడ్ స్థాయిలను పెంచి.. ధమనులను అడ్డుకుంటాయట. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

- అధిక కొవ్వు పదార్ధం, పాలు మరియు పాల ఉత్పత్తులలోని హార్మోన్లు రొమ్ము క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్లకు దోహదం చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

-పాల ఉత్పత్తులు సెబమ్ ఉత్పత్తికి దోహదపడే కొన్ని హార్మోన్లను పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మంపై జిడ్డుగల మైనపు పదార్థం మొమలకు సెబమ్  కారణమవుతుంది.

 


logo