శుక్రవారం 05 జూన్ 2020
Beauty-tips - Apr 19, 2020 , 20:09:19

మొటిమలతో బాధపడుతున్నారా?

మొటిమలతో బాధపడుతున్నారా?

-గిన్నెలో నిమ్మరసం, నీటిని రెండింటినీ బాగా కలుపాలి. కాటన్‌ బాల్‌ను ఈ మిశ్రమంలో డిప్ చేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి. 

-15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు వాడడం వల్ల మొటిమలు తొలుగుతాయి.

-యాపిల్ సిడర్ వెనిగర్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని కొంచెం నీటిలో వేసి కలుపాలి. 

-కాటన్ బాల్‌ను ఈ మిశ్రమంలో డిప్ చేసి ముఖానికి రాసి లేవగానే గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ పద్ధతిని రెండురోజులకు ఒకసారి అనుసరించాలి.

-టమాటాను సగానికి కట్ చేయాలి. ఈ ముక్కలను మొటిమలు ఉన్న ప్రదేశంలో రుద్దాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. 

-రోజులో కనీసం ఒకసారి ఇలా చేస్తే మొటిమలు తొలిగి చర్మం సున్నితమవుతుంది.

-గుడ్డులోని తెల్లసొన మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. కోడిగుడ్డులోని తెల్లసొనను వేరుచేయాలి. 

-ఈ మిశ్రమాన్ని బ్రెష్‌తో ముఖానికి రాయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మొటిమలు రమ్మన్నారావు.

-తేనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీన్ని ముఖానికి రాసుకోవాలి. 

-20 నిమషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. దీన్ని రోజుకు ఒకసారి పాటిస్తే చాలు. కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.


logo