శుక్రవారం 05 జూన్ 2020
Beauty-tips - Apr 11, 2020 , 15:39:40

పొట్టపై స్ట్రెచ్ మార్కుల‌ను పోగొట్ట‌లేమా?

పొట్టపై స్ట్రెచ్ మార్కుల‌ను పోగొట్ట‌లేమా?

గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు తొడ‌లు, రొమ్ము, పొట్టపై  స్ట్రెచ్ మార్కులు ఏర్ప‌డుతాయి. అంతేకాదు, లావుగా ఉన్న‌వారు ఒక్క‌సారిగా స‌న్న‌బ‌డ‌డం వ‌ల్ల కూడా ఈ గుర్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. వీటిని తొలిగించేందుకు ర‌క‌ర‌కాల మందులు వాడుతుంటారు. డ‌బ్బు ఖ‌ర్చు త‌ప్ప వాటితో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. మ‌ధ్య‌లో వ‌చ్చిన మార్పుల‌ను తొల‌గించ‌డానికి ఈ కింది చిట్కాలు పాటించండి. 

నిమ్మరసం :

స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్ర‌దేశంలో ప్ర‌తిరోజూ నిమ్మ‌కాయ‌ను రుద్దాలి. నిమ్మ‌లోని బ్లీచింగ్ ల‌క్ష‌ణాలు ఆ గుర్తుల‌ను తొలిగిస్తాయి. 

కలబంద :

సహజ వైద్యం చేసే ఏజెంట్‌గా క‌ల‌బంద పనిచేస్తుంది. చర్మంపై కలబంద జెల్‌ను పూయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఇది చ‌ర్మాన్ని స్మూత్‌గా చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

కొబ్బరి నూనె : 

కొబ్బరి నూనెతో సాగిన గుర్తులపై ప్రతిరోజూ మసాజ్‌ చేయడం వ‌ల్ల వాటిని వదిలించుకోవచ్చు. 

కోడిగుడ్డు తెల్లసొన : 

చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చేందుకు గుడ్డుసొన ఉప‌యోగ‌ప‌డుతుంది. మాంసకృత్తులు, అమైనో ఆమ్లం అధికంగా ఉండటం వల్ల  చర్మంపై సాగిన గుర్తును తేలికపరచడంలో సహాయపడుతుంది.


ఆలివ్ నూనె : 

ఇందులో తేమ లక్షణాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇది మంచి యాంటీఆక్సిడెంట్. స్ట్రెచ్ మార్కులపై ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల మ‌చ్చ‌లు అదృశ్యమవుతాయి.

బాదం  నూనె : 

బాదం గాని కొబ్బరి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయాలి. సాగిన గుర్తులను తొలగించడంలో అవి ఖచ్చితంగా సహాయపడతాయి.

బంగాళాదుంప రసం : 

క్రమం తప్పకుండా ఈ ర‌సాన్ని స్ట్రెచ్‌మార్కులపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  ఇందులో పిండి పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు స్కిన్ లైటనింగ్ ఎంజైమ్‌లను కూడా కలిగి ఉంటాయి. 


logo