హైదరాబాద్ : టిక్‌టాక్‌లో హాట్ హాట్ డ్యాన్స్ వీడియో పెట్టిన మిస్ పపువా న్యూగినియా తన కిరీటాన్ని కోల్పోయింది. 25 సంవత్సరాల లూసీ మైనో బెల్లీ డ్యాన్సు టైపు ఊపులతో ఓ మ్యూజిక్ వీడియో చేసి తన ప్రైవేటు టిక్‌టాక్ అకౌంటులో పెట్టింది. ఆ వీడియో తన కొంప ముంచుతుందని పాపం ఆమెకు తెలియదు. దానిని చాలామంది డౌన్లోడ్ చేసుకుని వైరల్‌గా మార్చారు. అందాల పోటీల కమిటీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమ్మాయిలకు ఆదర్శవంతమైన నడవడి కలిగి ఉండాల్సిన కిరీటధారిణి ఇలా చిల్లర డ్యాన్సులతో వీధికెక్కడమా అని ఆమె హోదాను రద్దు చేసింది. అయితే కొందరు మహిళా హక్కుల కార్యకర్తలు మాత్రం తప్పయితే అలాంటి వీడియోలు చేయొద్దని చెప్పాలి.. లేదా సంజాయిషీ కోరాలి. అంతే తప్ప ఉన్నపళంగా నీ కిరీటం రద్దు చేశాం పో.. అనడం ఏమీ బాగా లేదని కమిటీ తీరును విమర్శిస్తున్నారు.